అగ్రిగోల్డు బాధితుల దీక్ష‌కు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

విజ‌య‌వాడ‌: అగ్రిగోల్డ్‌ బాధితులు చేప‌ట్టిన‌ రిలే నిరా హార దీక్షలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కలెక్టరేట్ల వద్ద సోమవారం నుంచి అగ్రిగోల్డు బాధితుల‌ దీక్షలు ప్రారంభ మయ్యాయి. అగ్రిగోల్డ్‌ ఆస్తులను అమ్మి తమకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండు చేస్తున్నారు. ఈ మేర‌కు గురువారం విజ‌య‌వాడ‌లో చేప‌ట్టిన దీక్షా శిబిరాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కొలుసు పార్థ‌సార‌ధి సంద‌ర్శించి సంఘీభావం ప్ర‌క‌టించారు.  ఈ సంద‌ర్భంగా పార్థ‌సార‌ధి మాట్లాడుతూ.. సంస్థ ఆస్తుల వేలం ప్రక్రియను జరగకుండా యాజమాన్యం అడ్డుకుంటుందని మండిప‌డ్డారు. బాధితులు, ప్రజలకు సీఐడీ విచారణపై విశ్వాసం లేదని, సీఐడీ, అగ్రిగోల్డ్‌ యాజమాన్యం లాలూచీ పడినట్లు అర్థమవుతోందని ఆరోపించారు. కోర్టు జోక్యం చేసుకుని కేసును సమర్థవంతంగా విచారించి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు.

Back to Top