విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌విజ‌య‌వాడ‌: హ‌క్కుల సాధ‌న కోసం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేప‌ట్టిన ఉద్య‌మానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా నిలిచింది. బుధ‌వారం విద్యుత్ కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు చేప‌ట్టిన‌ మౌన ప్రదర్శనకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగి రమేష్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ..  కాంట్రాక్టు కార్మికులతో ప్ర‌భుత్వం  వెట్టిచాకిరీ చేయిస్తుంద‌ని మండిప‌డ్డారు. నెల‌కు క‌నీస వేత‌నం రూ. 7 నుండి 8 వేలు ఇస్తే కుటుంబాల‌ను ఎలా పోషించుకుంటార‌ని ప్ర‌శ్నించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల‌ని, కాంట్రాక్టు కార్మికులందరని పర్మినెంట్‌ చేసి తీరాలని డిమాండ్ చేశారు. 
Back to Top