క్షుర‌కుల ధ‌ర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

విజ‌య‌వాడ‌: క‌నీస వేత‌నాలు, ఉద్యోగ భ‌ద్ర‌త కోసం రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని ఆల‌యాల్లో ప‌ని చేస్తున్న క్షుర‌కులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. అన్ని ప్ర‌ధాన ఆల‌యాల్లో కేశ‌ఖండ‌న సేవ‌లు నిలిచిపోయాయి. వారి ధ‌ర్నాకు వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం పార్టీ అధికార ప్ర‌తినిధి కొలుసు పార్థ‌సార‌ధి, మ‌ల్లాది విష్ణు, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ క్షుర‌కుల ధ‌ర్నాలో పాల్గొని ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. ఈ నెల 10వ తేదీలోగా క్షుర‌కుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌న్న ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి చాలీచాల‌ని వేత‌నాల‌తో జీవ‌నం సాగిస్తున్న క్షుర‌కుల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ చిన్న‌చూపు చూస్తుంద‌న్నారు. క‌నీస వేత‌నం రూ.17 వేలు ఇవ్వాల‌ని, ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పార్థ‌సార‌ధి డిమాండు చేశారు.  ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే రేప‌టి నుంచి తిరుప‌తిలో కూడా కేశ‌ఖండ‌న కార్య‌క్ర‌మాలు నిలిపివేస్తామ‌ని హెచ్చ‌రించారు.
Back to Top