విద్యార్థుల వినూత్న నిరసన

– అనంతపురంలో హోదా కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
– చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన ప్రదర్శన 
అనంతపురం: ప్రత్యేక హోదా సాధనకు విద్యార్థులు రోడ్డెక్కారు. చంద్రబాబు నిన్న అసెంబ్లీలో కంటతడి పెట్టినట్లు నటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అనంతపురంలో వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు చేవిలో పువ్వులు పెట్టుకొని అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ, టీడీపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని, 2014వ సంవత్సరానికి ముందుకు చంద్రబాబు ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్నారని, అధికారంలోకి రాగానే మాట మార్చారన్నారు. హోదాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేశారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి వైయస్‌జగన్‌తో కలిసి పోరాటం చేయాలన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top