ఉద్యోగాలేవి బాబు?


గుంటూరు: ఎన్నికలకు ముందు 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని, పెట్టుబడుల సదస్సులతో లక్షలాది ఉద్యోగాలు అంటూ మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు మండిపడ్డారు. ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు తెచ్చారో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. మంగళవారం ప్రజా  సంకల్ప యాత్రలో పాల్గొన్న సలాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సంజీవని అని, తరువాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాటమార్చారన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని గ్రహించిన చంద్రబాబు తన మంత్రులతో రాజీనామా చేయించి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలన్నారు. 25 మంది ఎంపీలు తమ పదవులుకు రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందన్నారు. చంద్రబాబు యువత, నిరుద్యోగులను దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధిస్తామని సలాంబాబు ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top