విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన

అమరావతిః రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైయస్సార్సీపీ  విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. నారాయణ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించాలని, మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Back to Top