సీఎం కార్యాలయ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ ఇవాళ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తలపెట్టిన సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు సిద్ధమవుతుండగా  అంతకుముందే వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద విద్యార్థులను పోలీసులను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ¯ð లకొన్నాయి. దీంతో పోలీసులతో విద్యార్థి సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇంటికో ఉద్యోగం ఎప్పుడిస్తావ్‌ బాబూ అంటూ నిలదీశారు.

తాజా ఫోటోలు

Back to Top