వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుల విరాళాల సేకరణ

గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన గుంటూరు విద్యార్ధి జయభరత్ రెడ్డి(24 )ని ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో వైద్యం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో అతన్ని కాపాడేందుకు..విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 50 వేల డాలర్లు సేకరించారు. 

జయభరత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే ఓ సర్జరీ చేసిన వైద్యులు... మరో సర్జరీ చేయాలని సూచించారు. భరత్ కు మెరుగైన చికిత్స అందిచేందుకు మరో 70 వేల డాలర్లు అవసరం కావడంతో ...వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు వివిధ మార్గాల ద్వారా మరిన్ని విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.  అమెరికాలో ఎంఎస్ చదువుతున్న భరత్ శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 
Back to Top