ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి


విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండు చేశారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీలు నాలుగేళ్లుగా మోసం చేస్తున్నాయని విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ విశాఖలో శనివారం వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దొంగ దీక్షలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల జీవితాలను చంద్రబాబు నాశనం చేశారని మండిపడ్డారు. 
 
Back to Top