జులై 5న డీఈవో కార్యాల‌యాల ముట్ట‌డిహైద‌రాబాద్‌:  విద్యా రంగ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జులై 5న రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న డీఈవో కార్యాల‌యాల‌ను ముట్ట‌డిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు స‌లాంబాబు తెలిపారు. ఈ మేర‌కు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంధ్యరాణికి వినతిపత్రం సమర్పించారు. ఈ సంద‌ర్భంగా స‌లాం బాబు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువోక్కటే అన్నారు. అలాంటి చదువు పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలో వెంటనే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందజేయ‌కపోతే ఆందోళ‌న తీవ్ర‌త‌రం చేస్తామ‌న్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తులు కల్పించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. డీఈవో కార్యాల‌యాల ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా స‌లాం బాబు పిలుపునిచ్చారు. 
Back to Top