ఇంధన ధరలు తగ్గించాలని వైయస్‌ఆర్‌ సీపీ వినూత్న నిరసన

అనంతపురం: పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఎద్దుల బండ్లపై బైక్‌లను తిప్పుతూ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో  నిరసన తెలిపారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. 
Back to Top