హైదరాబాద్: పార్టీ హైదరాబాద్ జిల్లా పరిశీలకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగతంగా లేకపోతే ఎన్నికలను ఎదుర్కోవటం కష్టమన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలన్నారు. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇక పార్టీలో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మంచిగా ఓట్లు పడ్డాయన్నారు.<br/>పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, పార్టీ సీనియర్ నేత విజయచందర్, మహిళా నేత అమృతాసాగర్, మైనార్టీ నేతలు హెచ్‌ఆర్ రెహమాన్, మతిన్, ఎస్. ముజ్తబా అహ్మద్ మాట్లాడారు. పార్టీ అధికార ప్రతినిధ సత్యం శ్రీరంగం, పార్టీ యువజన, ఎస్సీ,సేవాదళ్, కార్మిక, డాక్టర్స్, క్రమశిక్షణ, క్రిష్టియన్ మైనార్టీ, మహిళా, ఐటీ విభాగాల నేతలు బి.రవీందర్, ఎం.జయరాజ్, వెల్లాల రాంమోహన్, నర్రా భిక్షపతి, పి.ప్రఫుల్లారెడ్డి, వీఎల్‌ఎన్ రెడ్డి, కె.జి. హెర్బట్, ధనలక్ష్మి, ఎం.సందీప్ కుమార్, నాయకలు ఎం.శ్రీనివాస్ రెడ్డి, పి.సిద్ధార్థ రెడ్డి, సిటీ యూత్, సేవాదళ్, మైనార్టీ విభాగాల అధ్యక్షులు ఎ.అవినాష్ గౌడ్, బి.సుధాకర్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.