వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతమే ల‌క్ష్యం

ఆమదాలవలస: గ్రామ స్థాయిలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీని మరింత బలోపేతం చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని పార్టీ రాష్ట్ర హైపవర్‌కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలసలోని ఆయన స్వగృహంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్‌కూడలి వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న నవరత్నాల సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 237 బూత్‌ల పరిధిలో 2370 మంది బూత్‌కమిటీ సభ్యులను నియమించామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జె.జె.మోహన్‌రావు, బోర చిన్నంనాయుడు పాల్గొన్నారు. 

Back to Top