అసెంబ్లీలో వైఎస్సార్సీపీ వ్యూహ రచన

హైదరాబాద్: విజయవాడలో  ప్రజలను పీడించి వేధింపులకు గురిచేసిన టీడీపీ నేతల కాల్ మనీ సెక్స్ వ్యవహారం సహా అనేక అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వైఎస్సార్సీపీ  సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ,ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్  తెలిపారు. బీఏసీ సమావేశం జరపకుండా ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పడం సరికాదని నేతలు ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రజాసమస్యలపై చర్చ జరిగి పరిష్కారం చూపేంతవరకు సమావేశాలు కొనసాగాలని డిమాండ్ చేశారు. 

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్సార్సీపీ విస్తృతంగా చర్చించింది.  హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈసమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏమన్నారంటే....

కాల్ మనీ కేసు, బాక్సైట్ మైనింగ్ పై అసెంబ్లీలో చర్చిస్తాం
వీఆర్ఏ, అంగన్ వాడీ, ఆశావర్కర్ల సమస్యలను లేవనెత్తుతాం
నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తాం 
వరదలు, కరవు, మద్దతు ధర, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తాం
విచ్చలవిడి కల్తీమద్యం అమ్మకాలు, అమాయకులు చనిపోయిన ఘటనపై చర్చిస్తాం
ఏపీలో మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తాం
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తాం
ఆకాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేవరకు పోరాడుతాం

Back to Top