ఫేస్‌బుక్‌లో వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌అగ్రస్థానం

హైదరాబాద్:‌

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి చెందిన అధికారిక ఫేస్‌బుక్ పేజీ రికార్డు స్థాయిలో 3 లక్షల లైక్సును దాటింది. పార్టీ ఫేస్‌బుక్ లై‌క్సు (ఇష్టపడే వారి సంఖ్య) విషయంలో దేశంలోనే ప్రాంతీయ పార్టీలన్నిటిలోనూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ అగ్ర‌స్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, వై‌యస్‌ఆర్‌సీపీ ఆన్‌లైన్ కమ్యూనిటీ పోర్టల్‌లకు సంబంధించిన బృందం సభ్యులు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మను గురువారం ఉదయం ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సోషల్ మీడియాలో మంచి కృషిని సాగిస్తున్నారంటూ బృందం సభ్యులను‌ శ్రీమతి విజయమ్మ అభినందించారు. పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల లై‌క్సు (ఇష్టపడే వారి సంఖ్య) దాటడం నెటిజన్లలో శ్రీ జగన్‌పైన ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పథకాల గురించి మరింత విస్తృతంగా ప్రజలకు వివరించాలని శ్రీమతి విజయమ్మ వారికి సూచించారు.

మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడాన్ని నెటిజన్లకు అర్థమయ్యేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని శ్రీమతి విజయమ్మ అన్నారు. ప్రత్యర్థులను విమర్శించడం కంటే వై‌యస్‌ఆర్ చేసిన మంచి పనులు, పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు. పార్టీ ఏర్పాటై మూడేళ్ళు పూర్తి చేసుకున్న రోజు మార్చి 12వ తేదీనే పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ (www.facebook.com/ ysrcpofficial) 3 లక్షల లై‌క్సును పూర్తిచేసుకుంది. గురువారం ఉదయానికి ఈ సంఖ్య 3,10,000 వద్ద ఉంది. నెటిజన్లు విశేషంగా ఆదరిస్తుండడంతో ఇది క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Back to Top