ప్రత్యేకహోదా కోరుతూ నిరసనలు..!

ఏపీః ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు పోరాట వేగాన్ని పెంచాయి. వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడవరోజుకు చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుమేరకు...రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా ప్రత్యేకహోదాని కోరుతూ అన్నినియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. 

వైఎస్సార్ జిల్లా:
ప్రత్యేక హోదా కోరుతూ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తిరువీధి జయరాములు ఆధ్వర్యంలో బద్వేల్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాజంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎంపిడివోకు లేఖ ఇచ్చారు.

కర్నూలు: 
ప్రత్యేక హోదా కోరుతూ నంద్యాలలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో , కల్లూరులో వైఎస్సార్సీపీ నేత గౌరు సరిత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనకొనసాగతున్నాయి. ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాములు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు

తూర్పుగోదావరి: 
ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రైతు సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు, ముమ్మడి వరం, పి.గన్నవరం, అనపర్తి, అమలాపురం, రాజోలు, మండపేట, రామచంద్రాపురం, రాజానగరం, జగ్గంపేటల్లో రిలేనిరాహార దీక్షలు, ధర్నాలు కొనసాగుతున్నాయి,

పశ్చిమ గోదావరి: 
పెదవేగిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొవ్వూరులో వైఎస్సార్ సీపీ నేత తానేటి వనిత ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చింతల పూడి ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
బుట్టాయిగూడెంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు.

చిత్తూరు: 
మదనపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 

నెల్లూరు:
ప్రత్యేక హోదా కోరుతూ ఉదయగిరిలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.  మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. మనబోలులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. గూడురు  క్లాక్ టవర్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. 

ప్రకాశం: 
చీరాలలో వైఎస్సార్సీపీ నేత బాలాజీ ఆధ్వర్యంలో, కనిగిరి లో వైఎస్సార్సీపీ నేత బుర్రా మదుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దర్శిలో మూడవ రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

అనంతపురం:
ప్రత్యేకహోదాని డిమాండ్ చేస్తూ  కదిరిలో ఎమ్మెల్యే చాంద్ బాషా ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆద్వర్యంలో కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. తాడిపత్రిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.  వీఆర్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేత రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 

విశాఖ:
అనకాపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు మల్లా బుల్లిబాబు, జానకి రామరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు.

శ్రీకాకుళం:
ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చెక్ పోస్టు ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పలాసలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు.

కృష్ణా :
పెడన బస్టాండ్ సెంటర్ లో వైఎస్సార్సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు, ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించారు.

విజయనగరం:
ప్రత్యేక హోదా కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టరు కార్యాలయం నుంచి ఫూల్ బాగ్ కాలనీ వరకూ వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో  వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొటగట్ట వీరభద్రస్వామి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల ఆదిరాజు పాల్గొన్నారు. ఆంధ్రామేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ఏపీ నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు గోవిందరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు పాల్గొన్నారు. విజయనగరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
Back to Top