రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ నిరసనలు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో భూమన కరుణాకర్‌ రెడ్డి,  ఎంపీ వరప్రసాద్‌ పాల్గొన్నారు.

గురువారం కొవ్వొత్తుల ర్యాలీపై పాశవికంగా వ్యవహరించిన తీరుగానే.. శుక్రవారం నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ సహా జానకీరామరాజు, గొర్లి సూరిబాబులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షుడు శకంర్‌ నారాయణను సైతం పోలీసులు గృహ నిర్భంధం చేశారు.

Back to Top