రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ధర్నా

గుంటూరుః ఆరోగ్యశ్రీ పథకాన్ని పట్టించుకోని ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల కలెక్టరేట్ ల వద్ద రేపు వైయస్సార్సీపీ మహాధర్నా చేపడుతుందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైయస్సార్సీపీ శ్రేణులతో పాటు ఆరోగ్యశ్రీ అందని పేషెంట్లు, వారి తాలూకు బంధువులు కూడా ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఉమ్మడి ఏపీలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్నితీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top