రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రాక్షస పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

తూర్పు గోదావరి
వైయస్‌ జగన్‌పై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా జిల్లాలోని ప్రత్తిపాడు, శంకవరం, కంతులపుడి, ఏలేశ్వరంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్, అలమంద చలమయ్య ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు.కోరుకొండ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ సీనియర్‌ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద పార్టీ కో–ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశ్‌రావు, కందుల దుర్గేష్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాజమండ్రి అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు ఆకుల వీర్రాజు, జక్కంపూడి రాజా, కందుల దుర్గేష్, షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
గండేపల్లి, జగ్గంపేట, గోకవరం తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టారు.

పశ్చిమ గోదావరి
వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులకు నిరసనగా బుట్టాయగుడేం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 
చింతలపూడి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నాయకులు నవీన్‌బాబు, జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్‌లో పార్టీ నాయకులు గున్నం నాగబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆకేవీడు తహశీల్దార్‌కార్యాలయం  వద్ద పాతపాటి స్రరాజు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తాడేపల్లిగూడెం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

విశాఖపట్నం
వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులకు నిరసనగా జిల్లాలోని చోడవరం సమన్వయకర్త కరణం ధర్మ ఆధ్వర్యంలో బుచ్చయ్యపేట, చోడవరం, రావికమతం, రోలుగుంట మండల కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ, కోటపాడు మండల కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. నర్సీపట్నం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

చిత్తూరు
చంద్రబాబు రాక్షస పాలనకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. తిరుపతి భవానీ సర్కిల్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు.  వాల్మికిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జంగాలపల్లి శ్రీనివాసులు, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బైరెడ్డిపల్లెలో రెడ్డెమ్మ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పలమనేరులో సీవీ కుమార్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతి రూరల్‌ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సత్యవేడు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ నాయకుడు కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో ధర్నా, నిరసన ర్యాలీ చేపట్టారు. నాగలాపురం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ నాయకుడు ముణిరత్నం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

నెల్లూరు
బాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉదయగిరి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నాయుడుపేటలో సుబ్రహ్మణ్య రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 

కృష్ణా
వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. మైలవరం, రెడ్డిగుడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేపట్టారు. వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు విజయవాడలో నిరాహారదీక్ష చేపట్టారు. అయితే పోలీసులు ఈ దీక్ష శిబిరాన్ని భగ్నం చేశారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున దీక్షా శిబిరంలో కూర్చున్న పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డి, పైలా సోమినాయుడు, బొప్పన భవనకుమార్, బొల్ల విజయ్‌లను అరెస్టు చేశారు. వీరిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ఆధ్వర్యంలో మైలవరం, రెడ్డిగుడెం, జి.కొండురు, ఇబ్రహీపట్నం తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు.

అనంతపురం
వైయస్‌ జగన్‌పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కదిరి ఆర్డీవో కార్యాలయం వద్ద పార్టీ ఇన్‌చార్జ్‌ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, నిరసన ప్రదర్శన చేపట్టారు. గుంతకల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

కర్నూలు
వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులకు నిరసనగా కర్నూలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ నగర కన్వీనర్‌ హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ప్ర‌తిప‌క్ష‌నేతపై ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా కేసులు పెట్టింద‌ని వైయ‌స్ఆర్ సీపీ నందికోట్కూరు ఎమ్మెల్యే ఐజ‌య్య మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కు నందికోట్కూరు మండ‌ల కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. క‌ర్నూలు జిల్లా బ‌న‌గానెప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త కాట‌సాని రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ముందు ధ‌ర్నా నిర్వ‌హించారు. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త రాజ‌గోపాల‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో మండ‌ల కేంద్రం వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వైయ‌స్ జ‌గ‌న్‌పై పెట్టిన కేసును ప్ర‌భుత్వం వెంట‌నే వెన‌క్కు తీసుకోవాల‌ని కోరుతూ ఎమ్మార్వోకు విన‌తిప‌త్రం అంద‌జేశారు. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భుత్వ నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఎర్ర‌కోట జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. పత్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించారు. వైయ‌స్ జ‌గ‌న్‌పై ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా పెట్టిన కేసును వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

విజయనగరం
వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, నాయకులు మజ్జి చిన్న ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన ర్యాలీ చేపట్టారు.

గుంటూరు: సత్తెనపల్లి ఎమ్మార్వో ఆఫీసు వద్ద అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ‍్వర్యంలో నిరసన తెలిపారు. తాడికొండలో సురేష్‌ ఆధ్వర్యంలో, రేపల్లేలో మాజీ మంత్రి మోపిదేవి నేతృత‍్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 

ప్రకాశం
ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై పెట్టిన అక్ర‌మ కేసుల‌కు నిర‌స‌న‌గా ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా నిర‌స‌న‌లు హోరెత్తాయి . వైయస్ జగన్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పుల్లలచెరువులో సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎర్రగొండపాలెంలో కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా, ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత. చీరాలలో అమృతపాణి ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ. కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ తూమాటి మాధ‌వ‌రావు ఆధ్వ‌ర్యంలో ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో తాళ్లూరు మండ‌ల కేంద్రం వ‌ద్ద ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌కు నిర‌స‌న‌గా ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఎమ్మార్వోకు విన‌తిప‌త్రం అంద‌జేశారు. వైయ‌స్ జ‌గ‌న్‌పై పెట్టిన అక్ర‌మ కేసుల‌ను ఎత్తివేయాలంటూ ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ద్ద వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు పెద్ద ఎత్తున ధ‌ర్నా నిర్వ‌హించారు. ఎర‌గొండ పాలెం నియోజ‌క‌వ‌ర్గం పుల్ల‌ల చెర్వు మండ‌ల కార్యాల‌యం వ‌ద్ద పార్టీ సీనియ‌ర్ నేత రెంట‌ప‌ల్లి సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించారు. వైయ‌స్ జ‌గ‌న్‌పై కేసు ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు.

 వైయస్‌ఆర్‌ కడప: పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ వివేకానందరెడ్డి ఆధ‍్వర్యంలో ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందజేశారు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్‌ ఆధ‍్వర్యంలో నిరసన తెలిపారు.


శ్రీకాకుళం
వైయస్ జగన్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. నరసన్నపేటలో ధర్మాన క్రిష్ణదాస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆముదాలవలస ఎమ్మార్వో కార్యాలయం వద్ద తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 

Back to Top