ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

  • టీడీపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై వైయస్సార్సీపీ పోరుబాట
  • బాబు దిగజారుడు రాజకీయాలను ప్రజల్లో ఎండగడుతాం
  • పార్టీమారిన వారితో రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇవ్వడం అనైతికం
  • రాజ్యాంగానికి తూట్లు పొడవడం బాబుకు అలవాటుగా మారింది
  • రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రాష్ట్రపతి, ప్రధానిలను కోరతాం
  • జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడుతాం
  • మీడియా సమావేశంలో వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్ః టీడీపీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలను నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని హెడ్ క్వార్టర్స్ లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు వైయస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించే అన్ని పార్టీలు, మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు కలిసిరావాలని కోరారు. ఇతర పార్టీ సింబల్ పై గెలిచిన వారిని రాజీనామాలు చేయంచకుండా చంద్రబాబు ఏవిధంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని వైవీ నిలదీశారు. ఇదే విషయంపై తమ నాయకుడు వైయస్ జగన్  నిన్న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి, ప్రధానిని కూడ కలవనున్నట్టు చెప్పారు. జాతీయస్థాయిలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని భావించే అన్ని పార్టీలను వైయస్  జగన్ నాయకత్వంలో కలిసి మద్దతు కూడగొడతామన్నారు. ఏపీలో జరుగతున్న పరిణామాల్ని వివరిస్తామన్నారు.  పార్లమెంట్ లో కూడ టీడీపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎండగడుతామన్నారు.

వైయస్సార్సీపీ శాసనసభ్యులుగా కొనసాగుతూ  రాజీనామా కూడ చేయించకుండా మంత్రిగా ప్రమాణం చేయించడం రాజ్యాంగ విరుద్ధం కాదా?అని వైవీ బాబును ప్రశ్నించారు. ఇదో  బ్లాక్ డే గా వర్ణిస్తూ వారిని అనర్హులుగా ప్రకటించేలా చూడాలని వైయస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాజీనామాలు చేశాకే గవర్నర్ చేత ప్రమాణం చేయించారని పేపర్ లో లీకులు రావడం దారుణమన్నారు. రాజీనామాలు చేసినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసి ప్రజాతీర్పు ఎందుకు కోరడం లేదని నిలదీశారు.  ఆర్టికల్ 164(1)లో మంత్రిమండలి అధికారాలపై స్పష్టంగా ఉందని వైవీ తెలిపారు.  బాబు రాజ్యాంగానికి తూట్లు పొడవడం ఇది మొదటిసారి కాదని, ఎన్టీఆర్ హయాం నుంచే ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేస్తున్నాడని దుయ్యబట్టారు. స్పీకర్, గవర్నర్ లతో ఏవిధంగా కావాలనుకుంటే ఆవిధంగా చేయించుకోవడం బాబుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.  ఎన్టీఆర్ టైంలో చేసింది అనైతికం. ఈరోజు జరుగుతోంది రాజ్యాంగ విరుద్ధమేనని వైవీ తెలిపారు. బాబు దిగజారుడు  రాజకీయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈనెల 7న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలుపుతామన్నారు. 

ఒక పార్టీకి అన్యాయం జరిగిందని ప్రత్యేక చట్టం చేయాలా అంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఇది ఒక్కపార్టీకి జరిగింది కాదని, దేశంలో అన్ని పార్టీల్లో జరుగుతున్నాయన్నారు. గతంలోనే తాము రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పామని, ఎమ్మెల్యేల రాజీనామాను అంగీకరించేలా  టైమ్ బాండ్ పెట్టాలని మొదటినుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంకయ్యనాయుడుకు చిత్తశుద్ధి వుంటే  ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఏవిధంగా ఇస్తారని తన మిత్రపక్షాన్ని ప్రశ్నించాలని వైవీ చురక అంటించారు. ఇది అనైతికమో, నైతికమో వెంకయ్యనాయుడు చెప్పాలన్నారు. 


Back to Top