ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా

హైదరాబాద్ః రాష్ట్రవ్యాప్తంగా ఐదునెలల పాటు నిర్విరామంగా గడపగడపకూ వైయస్ఆర్  కార్యక్రమం జరిగిన తీరుతెన్నులను పార్టీ నేతలు అధ్యక్షులు వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారని వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. దాదాపు 80 రోజుల పాటు జరపాల్సి ఉన్న ఈ కార్యక్రమంలో 90 శాతం మేరకు జరిగిందని, అనుకున్నదానికంటే ఎక్కువగా టార్గెట్ రీచ్ అయ్యామని చెప్పారు. పార్టీ నాయకులు పట్టుదలతో అన్ని నియోజకవర్గాల్లో గడపగడపకూ కార్యక్రమాన్ని కొనసాగించారని చెప్పారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ అన్ని జిల్లాల్లో ఈనెల 9న ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో జరిగే ధర్నాలో వైయస్ జగన్ పాల్గొంటారని ఉమ్మారెడ్డి ప్రకటించారు.

Back to Top