రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు

ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు చేపట్టింది. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం ధిక్కరించిన ప్రభుత్వ నియంత పాలనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు నిరశనకు దిగారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరుచేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని పార్టీ నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి అనే నినాదాలతో అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ సర్కార్ గద్దె దిగాలని వారు డిమాండ్ చేశారు.
Back to Top