ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలోటీడీపీ విఫ‌లం

శ్రీ‌కాకుళం: ప‌్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో బాబు స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రెడ్డి శాంతి అన్నారు. సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన గ్రీవెన్స్ సెల్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రెడ్డి శాంతి వంశ‌ధార నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ వంశ‌ధార నిర్వాసితుల‌కు న్యాయం చేస్తామ‌న్న బాబు అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా చేయ‌డం లేద‌న్నారు. ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క‌టీ చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌న్నారు. ముఖ్యంగా రైతులు అయితే బాబు పాల‌న‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్నారు.  ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన బాబుకు వాళ్ల ఉసురు క‌చ్చితంగా త‌గులుతుంద‌ని హెచ్చ‌రించారు. 
Back to Top