వైయస్సార్సీపీ రాష్ట్ర కమిటీల ప్రకటన

హైదరాబాద్ః తెలంగాణ వైయస్సార్సీపీ పార్టీ కమిటీలను ప్రకటించింది. ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, 18 మంది కార్యదర్శులతో రాష్ట్ర కమిటీ జాబితాను విడుదల చేసింది. అదేవిధంగా జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల సభ్యులను కూడా నియమించింది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ కమిటీలను నియమించారు. 

రాష్ట్ర కమిటీ సభ్యులు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి(వరంగల్), మతిన్ అహ్మద్ ముజాధీ(హైదరాబాద్)లను నియమించారు. రాష్ట్ర కార్యదర్శులుగా వడ్లోజుల వెంకటేశ్, తుమ్మలపల్లి భాస్కర్, శేఖర్ రెడ్డి, ఇరుగు సునీల్, ఎం. గవాస్కర్ రెడ్డి, పిట్టా రామిరెడ్డి (నల్గొండ), జి.రాంభూపాల్ రెడ్డి(మహబూబ్ నగర్), కుసుమ కుమార్ రెడ్డి, పి.కుమార్ యాదవ్, ఎం.ప్రభుకుమార్, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి (రంగారెడ్డి), ఎస్.హరినాథ్ రెడ్డి, మెట్టు రాఘవేంద్ర (హైదరాబాద్), డా.కె.నగేశ్(కరీంనగర్), కొమ్మర వెంకట్ రెడ్డి, బి. సంజీవరావు, ఆర్. చంద్రశేఖర్, తడక జగదీశ్వర్ గుప్తా(మెదక్)లను నియమించారు. 

ఐదు జిల్లాల అధ్యక్షులు
గ్రేటర్ హైదరాబాద్ వైయస్సార్సీపీ అధ్యక్షుడిగా బొడ్డు సాయినాథ్ రెడ్డి, వరంగల్ కు నాడెం శాంతికుమార్, మెదక్ కు జి. శ్రీధర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు ఎం. భగవంతరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వి. అనిల్ కుమార్ లను పార్టీ నియమించింది. వీరితో పాటు గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా ఎ. అవినాష్ గౌడ్, నల్గొండ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా  పచ్చిపాల వేణును నియమించారు. 

అనుబంధ విభాగాలకు..
రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా గంది హనుమంతు, రాష్ట్ర వైయస్సార్ టీయూసీ అధ్యక్షడిగా నర్రా బిక్షపతి, రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా డా.పి.ప్రపుల్లా రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నీలం రమేష్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా మతిన్ అహ్మద్ ముజాధీ, రాష్ట్ర ఎస్సీ సెల్  అధ్యక్షుడిగా మెండెం జయరాజ్, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా బి. శ్రీవర్థన్ రెడ్డిలను నియమించారు.  

To read this article in English: http://bit.ly/1YpJWEp 

Back to Top