రాష్ట్రబంద్‌ విజయవంతం చేద్దాం

- వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనంత వెంక‌ట్రామిరెడ్డి
- అనంత‌పురంలో భారీ బైక్ ర్యాలీ

అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24న రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని  పార్టీ  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనంత వెంక‌ట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.  బంద్ విజ‌య‌వంతం చేయాల‌ని కోరుతూ సోమ‌వారం అనంత‌పురం ప‌ట్ట‌ణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అనంత వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ..  నాలుగేళ్ల నుంచి తమ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి యువభేరీలు, బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేస్తూ హోదా అంశాన్ని సజీవంగా ఉంచారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇందుకు భిన్నంగా.. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు.ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. పార్లమెంట్‌ వేదికగా హోదా ఇవ్వబోమని బీజేపీ చెప్పినా టీడీపీ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. హోదా సాధన కోసం ఎంపీల రాజీనామాలు అడిగితే పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ, బీజేపీల తీరును నిరసిస్తూ తమ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిట్లు చెప్పారు.
 
Back to Top