అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

హైదరాబాద్: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.  విద్యుత్ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఛార్జీల పెంపును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతకు ముందు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై సభలో ప్రకటన చేశారు. ఛార్జీల పెంపును ఆయన ఈ సందర్భంగా సమర్థించుకున్నారు.
Back to Top