ఇలాంటి దుష్టసంప్రదాయం ప్రమాదకరం

ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం ఆటంకం
అడుగడుగునా అడ్డంకులు..సమయం వృథా
ఇష్టానుసారం సభ నడుపుతున్న టీడీపీ 
చర్చకు ఆస్కారం లేకుండా చంద్రబాబు కుట్ర
తూతూమంత్రంగా ఐదు రోజుల సమావేశాలు

హైదరాబాద్ః
కాల్ మనీ సెక్స్ రాకెట్, రోజా సస్పెన్షన్ లపై  ప్రభుత్వ నియంత, నిరంకుశ
వైఖరిని నిరసిస్తూ శాసనసభ, మండలి నుంచి వైఎస్సార్సీపీ రెండ్రోజుల పాటు బాయ్
కాట్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి
అధికారం లేకుండా మహిళా శాసనసభ్యురాలిని సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు.
ఇలాంటి దుష్టసంప్రదయాన్ని సభలో సృష్టించడం బాధాకరమన్నారు. భవిష్యత్ లో
ఎక్కడైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏపీలో జరిగిందని చెప్పుకునేలా పరువు
దిగజార్చేవిధంగా టీడీపీ ప్రవర్తిస్తోందని ఫైరయ్యారు. 

రాష్ట్రంలో
ఎన్నో సమస్యలున్నాయని బీఏసీలో చెప్పినట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. 14
ప్రధాన అంశాలతో పాటు అనేక సమస్యలను ముఖ్యమంత్రి సమక్షంలో స్పీకర్ దృష్టికి
తీసుకెళ్లామన్నారు. వీటన్నంటిపై కూలంకషంగా చర్చ జరిగి ప్రజలకు న్యాయం
చేయాలంటే కనీసం 10 రోజులైనా సమావేశాలు నిర్వహించాలని కోరితే అందుకు
తిరస్కరించారన్నారు. గతంలో మాదిరి ఈసారి కూడా చంద్రబాబు అసెంబ్లీ
సమావేశాలను తూతూమంత్రంగా కాలం గడపడం దారుణమని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం
చేశారు. 

అసెంబ్లీలో ఉన్న సమయాన్ని కూడా సద్వినియోగం చేసేందుకు వీల్లేకుండా..ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించిందని ఉమ్మారెడ్డి విమర్శించారు. 
ప్రధాన
అంశం కాల్ మనీ సెక్స్ రాకెట్ పై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చజరగాలని
కోరితే..అందుకు  అడ్డుపడుతూ  అర్ధాంతరంగా అంబేద్కర్ కు నివాళులర్పించే
విషయాన్ని తెరపైకి తెచ్చారన్నారు.  ఐదు రోజుల తర్వాత  మరో రెండ్రోజులు సభ
పొడిగించి..దేశ రాజ్యాంగ నిర్మాత మహనీయుని గురించి  చర్చిద్దామని చెప్పినా
ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు.


ప్రతిపక్షాన్ని
మూకుమ్మడిగా సస్పెండ్ చేసి టీడీపీ సర్కార్  సభ నడుపుకున్న తీరు బాధాకరమని
ఉమ్మారెడ్డి వాపోయారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు తమ పార్టీ
ఎమ్మెల్యేలు రోజా, కొడాలినాని, ఉప్పులేటి కల్పన ముగ్గురు పేర్లిచ్చామని
ఉమ్మారెడ్డి తెలిపారు. మహిళలపై అన్యాయాన్ని ప్రశ్నించేందుకు రోజా ముందు
వరుసలో ఉంది కాబట్టి ఆమెను కావాలనే పథకం ప్రకారం సస్పెండ్ చేశారన్నారు.
 ఆమె ఎలాంటి అసభ్య మాటలు అనకున్నా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చిందన్న సాకు
చూపి..సంవత్సరం కాలం పాటు సస్పెండ్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. 

రోజా
 కామ బాబు అని మాత్రమే అందని కామ అంటే కాల్ మనీ అని అర్థమన్నారు. సెక్స్
రాకెట్ ఇష్యూను డైవర్ట్ చేసే కుట్రలో భాగంగా ... హౌస్ లో ఎలాంటి ఓటింగ్ ,
ఆమెదం లేకుండానే , నింబధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారన్నారు. తమ
అధ్యక్షులు వైఎస్ జగన్  రూల్స్ ప్రొసీజర్  చదివి వినిపించి సస్పెండ్
చేయడానికి అధికారం ఎక్కడ లేదని చెప్పారు. ఇది తప్పు సంప్రదాయం అని,  న్యాయం
కాదని సభ సజావుగా సాగేలా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరితే
వినిపించుకోలేదన్నారు. అధికార పక్షం సభ్యులు సభా నియమాలకు తూట్లు పొడుస్తూ
 వాళ్ల ఇష్టానుసారం ప్రతిపాదనలు చేసుకొని సభలో ప్రతిపక్షం గొంతు
నొక్కతున్నారని నిప్పులు చెరిగారు. 
Back to Top