అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ చేసింది.  స్పీకర్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు బడ్జెట్పై మాట్లాడుతుండగానే సమయం ముగిసిందంటూ మైక్ కట్ చేయటం బాధాకరమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 
 
తాము ఏం మాట్లాడాలో కూడా స్పీకర్ ఆదేశిస్తే ఎలా అన్నారు. రైతు సమస్యలపై మాట్లాడితే వినే ఓపిక ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి స్పీకర్ను ఎప్పుడూ చూడలేదని, అధికార పక్షం చెప్పినట్లుగానే స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ జగన్ ...  స్పీకర్కు, సభకు దండం పెడుతూ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
Back to Top