సాగు, తాగు నీటి కోసం కడప జిల్లాలో రాస్తారోకో

కడప: సాగు, తాగు నీటి కోసం కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈ నెల 5వ తేదీన (రేపు) అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గంట పాటు రాస్తారోకో నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగు, తాగు నీటిని ఇప్పుడు పోరాడి సాధించుకోకపోతే భవిష్యత్తులో పోట్లాటలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం వైఎస్‌ఆర్‌సీపీ ఓ అడుగు ముందుకేసి అన్ని పార్టీలను కూడగట్టి ప్రాజెక్టులను పరిశీలించిందన్నారు.
Back to Top