ప్రజల్లో వ్యతిరేకతను చూసే బాబు మాట మార్చారు

  హైదరాబాద్‌:  కేవలం ప్రజల్లో వ్యతిరేకతను చూసే చంద్రబాబు మాట మార్చారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వైయస్‌ జగన్‌ బాటలోకి వచ్చినందుకు సంతోషమన్నారు. కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 25 మంది ఎంపీలు ఒకే మాట మీద ఉన్నారని చెప్పాల్సిన  బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కేంద్రాన్ని తప్పుపట్టాలంటే ఏపీ ఎంపీలంతా ఒక్కటిగా ఉండాలన్నారు. వేచి చూసే దోరణి కాకుండా ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని,  మార్చి 21న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ ఎంపీలు మద్దతివ్వాలని కోరారు. లేదంటే టీడీపీ అవిశ్వాసం పెట్టినా మేం మద్దతిస్తామన్నారు. 
 
Back to Top