కేంద్రమంత్రుల రాజీనామా ఒక డ్రామా

29సార్లు ఢిల్లీకి వెళ్లానని బాబు చెప్పడం సిగ్గుచేటు
వైయస్‌ జగన్‌ ప్రజాదరణ చూసి భయంతో హోదా రాగం
బాబుకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయ్‌
ప్రకాశం: ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రుల రాజీనామా ఒక డ్రామా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తరువాత మూడు మాసాల్లో చంద్రబాబు ప్యాకేజీకి మొగ్గుచూపారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంతో రాజీపడి ప్యాకేజీ కావాలని తీసుకువచ్చి దోపిడీకి అలవాటు పడ్డారన్నారు. ప్రజల కోసం పరితపిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రజాదరణ వెల్లువలో కొట్టుకుపోతాననే భయంతో చంద్రబాబు హోదా అవసరం అని కొత్తరాగం అందుకున్నాడన్నారు. ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీ వెళ్లానని సిగ్గులేకుండా చెబుతున్నాడన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నాడన్నారు. నాలుగేళ్లుగా అధికారాన్ని అనుభవించి కేంద్ర నిధులను దోపిడీ చేసిన చంద్రబాబు ప్రజల తిరుగుబాటు తట్టుకోలేక ఇప్పుడు హోదా అని మాట్లాడుతున్నారన్నారు. ఇంకా ప్రజలను మాయచేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబుకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top