బాబు దుష్ట పరిపాలనకు చరమగీతం పాడుదాం

– ప్రజా ప్రస్థానంతో ప్రజల గుండెల్లో వైయస్‌ఆర్‌ చిరస్థాయిగా నిలిచారు
– 9 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు
– 2003కి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేడు అంతకంటే అధ్వాన్నం
– వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రతో టీడీపీలో కలవరం

విజయవాడ: చంద్రబాబు దుష్ట పరిపాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వ్యవస్థలను మ్యానేజ్‌ చేసే చంద్రబాబు గత 9 ఏళ్ల పాలన కంటే ప్రస్తుతం అధ్వాన్నంగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 2003లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో చెవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారన్నారు. నాడు చంద్రబాబు 6 సార్లు కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచారన్నారు. ఈ తీరు దారుణమని నాడు వైయస్‌ రాజశేఖరరెడ్డితో పాటు వామపక్షాలు ఆందోళన చేపడితే బషీరాబాగ్‌లో చంద్రబాబు కాల్పులు జరిపించి ఐదుగురిని పొట్టన పెట్టుకున్నారన్నారు. వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి పాలన చేస్తున్న తరుణంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి చంద్రబాబు దుష్ట పాలనను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేశారన్నారు. చేవెళ్లలో చిన్న కార్యక్రమంగా మొదలై ఇచ్చాపురం చేరే వరకు మహా ఉద్యమంలా సాగిందన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా రంజక పాలన అందించారన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైయస్‌ఆర్‌ పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు తెలుసుకొని, అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆ రోజు ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే చంద్రబాబు హేళన చేశారన్నారు. దాన్ని ఆచరణలో చేసి చూపించారన్నారు. ఇవాళ 108, 104, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఎవరూ తీసివేసే ధైర్యం చేయలేకపోతున్నారన్నారు. అయితే మహానేత పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహానేత హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించకపోతే ఈ రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో నడిపించేవారు అన్నారు. ఆ రోజు ఓడిపోయిన వ్యక్తి చంద్రబాబు దురదృష్టవశాత్తు మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు. 2003కు ముందు ఇవాళ ఏవిధమైన పరిస్థితులు ఉన్నాయని భేరిజు వేసుకుంటే మళ్లీ అప్పటి కంటే దారుణమైన పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. జరగనివి జరిగినట్లు చూపుతున్నారన్నారు. నాడు వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు ఈ రోజు దండుకుంటున్నారన్నారు. చంద్రబాబు చేసిన 600 వాగ్ధానాల్లో పది హమీలు కూడా నెరవేర్చలేదన్నారు. దేశంలోనే ఏపీ అవినీతిలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. రాజధాని పేరుతో అవినీతి ఇంతా అంతా కాదు అన్నారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రిపదవులు ఇచ్చారన్నారు.  ఇలాంటి పాలనకు చరమ గీతం పాడేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు.ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర దినదిన ప్రవర్ధమానంగా పెరిగి ఇవాళ రాజధాని ప్రాంతంలో ప్రభంజనంగా మారిందన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు, టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. ఆ రోజు చంద్రబాబు పాలన దుష్ట పాలన అంతం చేసేందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం చేపడితే ..ఈ రోజు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారని, టీడీపీ పాలన అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని అంబటి రాంబాబు కోరారు. 






 
Back to Top