బాబు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు

టీడీపీ మ‌హిళా వ్య‌తిరేక ప్ర‌భుత్వం
ఎమ్మెల్యే రోజాపై పోలీసుల తీరు దారుణం
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు
గుంటూరు:  తెలుగు దేశం పార్టీ మ‌హిళా వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. మ‌హిళా సద‌స్సుకు వెళ్ల‌కుండా ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకున్న తీరును ఆయ‌న ఖండించారు. మ‌హిళ‌ల‌ప‌ట్ల నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. శ‌నివారం సాయంత్రం ఆయ‌న గుంటూరులో మీడియాతో మాట్లాడారు. అంబ‌టి రాంబాబు ఏమ‌న్నారంటే.. మ‌హిళా స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు విజ‌య‌వాడ వ‌చ్చిన ఎమ్మెల్యే రోజాను కించ‌ప‌రిచే విధంగా పోలీసుల‌చేత అరెస్టు చేయించ‌డం దుర్మారపు చ‌ర్య‌. ఇది ప్ర‌జాస్వామ్య‌దేశామా?  లేక రాజ‌రిక పాల‌నా?. చ‌ంద్ర‌బాబు మూల్యం చెల్లించుకోక త‌ప్పుదు. ఇదే స్పీక‌ర్ ఏడాది పాటు రూల్స్‌కు విరుద్ధంగా స‌స్పెండ్ చేశారు. వెంక‌య్య కూతురు, చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్ర‌హ్మిణితో మాట్లాడించారు. వారికున్నంత గౌర‌వం కూడా రోజాకు లేదా? ఎమ్మెల్యేకు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా, క‌నీసం స‌భాలో పాల్గొన‌కుండా అడ్డుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం. ఈ స‌భ‌లో మాట్లాడిస్తే మీకు..మీకుటుంబానికి ఎంత‌టి గౌర‌వం ఉందో బ‌ట్ట‌బ‌య‌లు అయ్యేది. రాష్ట్రంలో ఏం జరిగినా పోలీసు వ్య‌వ‌స్థ‌ను మీ జోబు సంస్థ‌లాగా ఉప‌యోగించుకుంటున్నారు. ఇటీవ‌ల ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కూడా ర‌న్‌వే పై నిలిపివేశారు. కాపు నేత ముద్ర‌గ‌డ‌ను అవమానించారు. ఇలాంటి చాలా దారుణ‌మైన అంశాలు. ఒక‌వైపు జాతీయ మ‌హిళా స‌ద‌స్సులు జ‌రుగుతుంటే..మ‌రో వైపు మ‌హిళా ఎమ్మెల్యేను అవ‌మానించ‌డం దారుణం. సోష‌ల్ మీడియాలో వ‌చ్చి న వదంతుల మేర‌కు ఆమెను అరెస్టు చేశార‌ట‌. ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు ప్ర‌జ‌ల సొమ్ముతో మీరు ప‌నిచేస్తున్నారు. సంఘ విద్రోహ‌శ‌క్తులు ఉంటే వారిని అణ‌చ‌డానికి ప్ర‌యత్నించాలి కానీ. మీరే సంఘ విద్రోహులుగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు. టీడీపీ నేత‌లు చెప్పిన‌ట్లు వింటూ ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను అక్ర‌మంగా అరెస్టు చేయ‌డం భావ్యం కాదు. పోలీసు అధికారులు జాగ్ర‌త్త‌గా విధులు నిర్వ‌హించాల‌ని హెచ్చ‌రిస్తున్నాం. 
Back to Top