టీడీపీని కాపాడేందుకు పవన్‌ ప్రయత్నం

విజయవాడ: తన పార్ట్‌నర్‌ టీడీపీని కాపాడేందుకు పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. ఆయనకు రాజకీయ అవగాహన లేదని, నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. అవిశ్వాసంపై పవన్‌ సవాల్‌ను వైయస్‌ జగన్‌ స్వీకరించారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారని తెలిపారు. ఏప్రిల్‌ 6న మా ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాలు పవన్‌కు కనిపించడం లేదా అని పార్థసారధి ప్రశ్నించారు. తన పార్ట్‌నర్‌ టీడీపీని కాపాడేందుకు మళ్లీ పవన్‌ యత్నిస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతాన న్న పవన్‌ ఢిల్లీకి వెళ్లకుండా పారిపోయారన్నారు. 


 
Back to Top