మోసాలు బయటపడినప్పుడు బాబు ఆక్రోశంతో మాట్లాడుతారు


విజయవాడ:  చంద్రబాబు మోసాలు బయటపడినప్పుడల్లా ఆక్రోశంతో మాట్లాడుతారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో కూడా అదే ఆక్రోశంతో మాట్లాడారని గుర్తు చేశారు.  అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఈ నెల 19న తలపెట్టిన మహా సంకల్ప మానవహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు నాలుగేళ్లుగా చేసిన మోసాలు బయటపడ్డాయని, వైయస్‌ జగన్‌ ఇన్నాళ్లు చెబుతూ వస్తున్నవి వాస్తవమని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారని, ఈయన ఒక్కరికే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నట్లు భావించడం భావిస్తున్నారని, ఆయన పక్కనే కేఈ కృష్ణమూర్తి, అశోక్‌ గజపతిరాజు, బుచ్చయ్యచౌదరిలు ఉన్నారన్న విషయం గుర్తించుకోవాలన్నారు.
 
Back to Top