ఆది..కడప రెడ్డివైతే రాజీనామా చేయ్‌ – ఆదినారాయణరెడ్డి అన్నకు రాజకీయ బిక్షపెట్టింది వైయస్‌ఆర్‌
– వైయస్‌ఆర్, చంద్రబాబుకు రాజకీయ చరిత్రపై చర్చకు సిద్ధమా
– అచ్చెన్నాయుడు..నోరు అదుపులో పెట్టుకో
హైదరాబాద్‌: దొడ్డిదారిన మంత్రి అయిన ఆదినారాయణరెడ్డికి నిజంగా కడప రెడ్డి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు సవాల్‌ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే  చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే చంద్రబాబు చరిత్ర, వైయస్‌ఆర్‌ చరిత్రపై చర్చించేందుకు సిద్దమా అని చాలెంజ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని ఆయన ఖండించారు. చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి పంది బురదలో దోర్లినట్లు దొర్లుతూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ బిక్ష పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తావా అని నిలదీశారు. నీవు ఓ మనిషివేనా అని, అసలు నీవు నాయకుడివా అని ప్రశ్నించారు. నీ రాజకీయ చరిత్ర ఏంటో చూసుకోవాలని సూచించారు. 2009కి ముందు మీ అన్న నారాయణరెడ్డి 3 సార్లు రామసుబ్బారెడ్డి కింద ఓడిపోయారన్నారు. చందాలు, దందాలతో మదమెక్కి, నారా వారి నక్కజిత్తుల్లో చిక్కి మాట్లాడుతున్నావని మండిపడ్డారు. మీ అన్న నారాయణరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి దయతో డీసీసీ చైర్మన్‌ అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. కడప జిల్లాలో  ఉద్దండులు ఉన్నా..మీకుటుంబానికి ప్రాధాన్యత కల్పించిన గొప్ప మనసు ఉన్న వ్యక్తి వైయస్‌ఆర్‌ అన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని గురించి నీవు చర్చిస్తావా? నీ స్థాయి ఎంత? నీవెంత అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ చరిత్రను, వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబ రాజకీయ చరిత్రను చర్చిద్దాం దమ్ముంటే ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. చంద్రబాబు ప్రతినిధిగా నీవు రా, వైయస్‌ఆర్‌ కుటుంబం నుంచి మేం చర్చకు వస్తామని, ప్లేస్‌ నీవే డిసైడ్‌ చేసుకో అని చాలెంజ్‌ చేశారు. అసెంబ్లీలోనా, అమరావతి విధిలోనా, కడప నడిబొడ్డునా, జమ్ములమడుగు నడిరోడ్డుపైనైనా చర్చకు సిద్ధమే అన్నారు. ఆదినారాయణరెడ్డి నీకు కలేజా ఉంటే , కడప రెడ్డివి అయితే, సీమ పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మా సవాల్‌ను స్వీకరించాలన్నారు. నారావారి నక్కజిత్తుల కంపెనీలో నీవు పనిచేయకపోతే నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీ గుర్తుతో గెలిచిన నీవు దొడ్డిదారిన టీడీపీలో చేరి మంత్రివి అయ్యావన్నారు. ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. రెండోసారి వాజ్‌పేయి పుణ్యమా అని ముఖ్యమంత్రి అయ్యారు, నిన్న పవన్, బీజేపీ పొత్తుతో చంద్రబాబు సీఎం పీఠం ఎక్కారన్నారు. మా నాయకుడు, మీ నాయకుడికి పోటీనా అన్నారు. మా నాయకుడు కేంద్రాన్ని, సోనియాగాంధీని ఎదురించిన ధీరుడని చెప్పారు. చంద్రబాబు చరిత్ర అంతా వెన్నుపోట్లే అన్నారు. ఆదికి సిగ్గుంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు.
అచ్చెన్నాయుడు ఆరు అడుగులు ఉంటారు. అన్నగారు చనిపోతే మంత్రి అయిన వ్యక్తి కూడా వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నారన్నారు. అచ్చెన్నాయుడు ఇక 9 నెలలే నీ అధికారం. ఆ తరువాత నీ బాగోతం అంతా శ్రీకాకుళం జిల్లా ప్రజలు బట్టబయలు చేస్తారని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.
 
Back to Top