ప్రజాదరణను ఓర్వలేక వైయస్‌ జగన్‌పై విమర్శలు

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వస్తున్న ప్రజా దరణను చూసి ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి అన్నారు. విభజన హక్కులు సాధించలేని దుర్భరస్థితిలో పాలన సాగుతోందని ఆమె మండిపడ్డారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వాటాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 
 
Back to Top