2018 డిసెంబర్‌ 31 వరకు గడువిస్తాం

చంద్రబాబు అవినీతి ఎక్కడైనా సాక్షాధారాలతో ఎండగడతాం
వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు
విజయవాడ: చంద్రబాబు అవినీతిని ఎక్కడైనా సాక్షాధారాలతో సహా ఎండగడతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సుధాకర్‌బాబు అన్నారు. వర్లరామయ్య బహిరంగ చర్చకు వస్తానని ఢాంబికాలు పలికి పత్తాలేకుండా పోయారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపించాలని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు టీడీపీ నేతలకు బహిరంగ సవాల్‌ను విసిరారు. బిట్‌ కాయిన్‌ చీటింగ్‌ వ్యవహారంలో నిందితుడు రామకృష్ణారెడ్డికి వైయస్‌ జగన్‌తో సంబంధాలు ఉన్నాయని రామయ్య ఆరోపణ చేశారు. ఆ ఆరోపణలను తిప్పికొడుతూ.. చంద్రబాబు అవినీతిపై జనవరి 1న ప్రకాశం బ్యారేజీ వద్దకు సిద్ధమని చెప్పిన టీడీపీ నేతలు ప్రకాశం బ్యారేజీ కాదు.. బార్‌ అసోసియషన్‌కు రావాలన్నారు. సుధాకర్‌బాబుతో పాటు వైయస్‌ఆర్‌సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు, బొప్పన భవకుమార్, రాజశేఖర్‌ సోమవారం వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు 3 గంటల పాటు ఎదురు చూసినప్పటికీ వర్ల రామయ్యతో సహా అధికార పార్టీ నేతలు రాలేదు. ప్రకాశం బ్యారేజీ, బార్‌ అసోసియేషన్, వర్ల రామయ్య ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

వర్ల రామయ్యకు డిసెంబర్‌ 31 2018 వరకు గడివిస్తున్నామని, ఆలోగా దమ్ముంటే చర్చకు రావాలని సుధాకర్‌బాబు అన్నారు. కెమెరాల ముందు పబ్లిసిటీ కోసం మాట్లాడడం కాదని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. చర్చకు వస్తానని చెప్పి తప్పించుకోవడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

Back to Top