ఎన్‌డీఏలో కొనసాగడం మోసపూరితం కాదా?

– వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ 
– ఇన్ని మోసాలు చేసి ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు
– 33 వేల ఎకరాలు విదేశీయులకు తాకట్టుపెట్టి సొమ్ము చేసుకునే తపత్రయం
– పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం వాడుకుంటున్నారు

హైదరాబాద్‌: మంత్రులు రాజీనామా చేసి టీడీపీ ఎన్‌డీఏలో కొనసాగడం మోసపూరితం కాదా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్నది ఎన్‌డీఏ ప్రభుత్వం కాదా అని ఆయన నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.  శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.   చంద్రబాబు మంత్రులు రాజీనామా చేస్తారట. కానీ ఎన్‌డీఏలోనే కొనసాగుతారంట. ఇంతకన్న మోసం ఎవరైనా చేస్తారా అంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే అన్నారు. నీవు కొనసాగుతున్న కూటమి మీదే చేయలేదని చెబుతావా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు ఉండి ప్రత్యేక హోదా సంజీవని కాదు, ముగిసిపోయిన అధ్యాయం, జగన్‌ రాజకీయాలు చేస్తున్నావని రకరకాల భాష్యాలు చెప్పిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూటర్న్‌తీసుకున్నారని అందరు భావించారన్నారు. అయితే ఆయన ఎన్‌డీఏ కూటమిలో కొనసాగడం, అవిశ్వాస తీర్మానం పెడితే ఏం వస్తుందని అంటున్నారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని మనవి చేశారు. వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని అభివర్ణించారు. 

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్నారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా కావాలంటున్నారని గుర్తు చేశారు. మొన్నటి వరకు అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ మన అభివృద్ధిని చెప్పమని చంద్రబాబు తన ఎంపీలకు చెబుతున్నారన్నారు. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి సాధించారని ప్రశ్నించారు. అమరావతిలో ఒక్కటైన పర్మినెంట్‌ పని చేశావా అని నిలదీశారు. రాజధాని కోసం వేలాది మంది రైతులు త్యాగం చేస్తే.. ఆత్యాగాన్ని కూడా చంద్రబాబు క్యాష్‌చేసుకుంటున్నారని మండిపడ్డారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లామని, అందర్ని కలిశానని గొప్పగా చెబుతున్నారని, అన్ని సార్లు వారితో కలిస్తే వారి ఆలోచన ఏంటో తెలియలేదా అని ధ్వజమెత్తారు. అసలు నీకు పరిపాలన దక్షత ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ మాదిరిగానే మీరు కూడా ఆలోచిస్తున్నారని విమర్శించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అసెంబ్లీ సీట్లు పెంచండి, కమీషన్లకు అడ్డుపడకండా, అంచనాలు పెంచడి, వైయస్‌ఆర్‌సీపీని అణచమని కేంద్ర మంత్రులనున కోరినట్లు వారే చెబుతున్నారన్నారు. 

చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష చంద్రబాబుకు ఏ కోశాన లేదన్నారు. కోర్టులు వద్దన్నా..ఉన్నతాధికారులు వద్దన్నా రైతుల వద్ద తీసుకున్న భూములను స్వీస్‌ చాలెంజ్‌ పద్ధతిలో విదేశీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. పోలవరం పూర్తి చేయాలన్న ఆకాంక్ష నీకుందా అని ప్రశ్నించారు. రూ.58 వేల కోట్లు రావాల్సి ఉండగా కేవం రూ.750 కోట్లు కేంద్రం ఇస్తే ఎప్పుడైనా ప్రశ్నించావా అని నిలదీశారు. చంద్రబాబు ఏం ముఖం పెట్టుకొని మీ ఎంపీలను ప్రజల వద్దకు పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమాలను చంద్రబాబు నీరుగార్చారని మండిపడ్డారు. నిన్నటి వరకు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పిన చంద్రబాబు ఈ రోజు ఆ అధ్యాయంపై మాట్లాడటాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలు చేశారని, ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ చేసే పోరాటాలకు అండగా ఉంటావా? ఇంకా రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తావో సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. మళ్లీ ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెడితే ఏం ఉపయోగమని చంద్రబాబు అనడం ఆయన మోసపూరిత వైఖరి తేటతెల్లమవుతుందన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top