మహిళలకు రక్షణ కరువు


హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు.  మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండో స్థానంలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై వరుసగా నేరాలు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టల్లేదని విమర్శించారు. మహిళల పట్ల నేరాల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉందని చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top