బాబు వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి

ప్రకాశం: చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక  హోదా రాలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చట్టంలో ఉన్న అంశాలను నెరవేర్చాలని చంద్రబాబు ఏనాడూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ప్రత్యేక ప్యాకేజీ అంటూ ముందుగా చంద్రబాబే పట్టుబట్టాడన్నారు. కమీషన్‌ల కోసం ప్యాకేజీ ఓకే చెప్పి ప్రజల మెప్పు కోసం ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. కేంద్రం మోసం చేసిందని మంత్రులతో రాజీనామాలు చేయించిన చంద్రబాబు మళ్లీ ఎందుకు ఎన్డీయేలోనే కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టాలనే కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు. ఇంకా బీజేపీతో పొత్తు సాగించుకుంటూ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకెనాళ్లు రాష్ట్రాన్ని మోసం చేస్తారని ప్రశ్నించారు. 
Back to Top