వైయ‌స్ జ‌గ‌న్ నిఖార్స‌యిన‌ నాయ‌కుడు



- చంద్ర‌బాబు ప‌చ్చి రాజ‌కీయ అవ‌కాశ‌వాది
- రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రితోనైనా క‌లుస్తారు
- చంద్ర‌బాబే కాంగ్రెస్ పొత్తుపై టీడీపీ నేత‌ల‌తో చ‌ర్చించారు
- సోమిరెడ్డి నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం స‌రికాదు
- గ‌త ఎన్నిక‌ల్లో గెలిచేందుకు బాబు ప‌వ‌న్ కాళ్లు ప‌ట్టుకున్నారు
- నైతిక విలువ‌ల గురించి మాట్లాడే అర్హ‌త టీడీపీ నేత‌ల‌కు లేదు
 
విజయవాడ: వాస్తవాలు వక్రీకరించి మాట్లాడడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధహస్తులని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆరో పెళ్లికి సిద్ధమయ్యారని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ నిఖార్స‌యిన నాయ‌కుడ‌ని, చంద్ర‌బాబు ప‌చ్చి రాజ‌కీయ అవ‌కాశ‌వాది అన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై ముందుస్తు ఎన్నికల్లో ఎవరితో కలిసి పో టీచేద్దామనే అంశంపై చర్చించారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చించినట్లు చంద్రబాబు తోకపత్రికల్లో వచ్చిందన్నారు. పచ్చ పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి చంద్రబాబు ఆరోపెళ్లికి సిద్ధమవుతున్నారని మాట్లాడారన్నారు. 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సందర్భం ఏంటీ సోదిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. బలవంతంగా ప్రజల మీద స్వారీ చేయడానికి దోపిడీ ముఠాకు నాయకుడిగా ముఖ్యమంత్రి అయ్యాడా అని నిలదీశారు. చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరూ..? ఎన్టీఆర్‌ మరణం సహజంగా జరిగిందా.. లేక చంద్రబాబు పెట్టే క్షోభను తట్టుకోలేక గుండెపగిలి చనిపోయాడా.. సోదిరెడ్డి?. సిద్ధాంతాల గురించి మాట్లాడే యనమల రామకృష్ణుడు స్పీకర్‌ స్థానంలో కూర్చొని నందమూరి తారక రామారావు 5 నిమిషాలు సమయం ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేని దుర్మార్గపు నాయకులు మీరని మండిపడ్డారు. చంద్రబాబు తొత్తులుగా, ఆయన నక్కజిత్తుల కాలేజీలో స్టూడెంట్స్‌గా ప్రారంభమై పాఠాలు మాకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. టీడీపీ నేతల చరిత్ర పనికిమాలిన చరిత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు కొమ్ముకాసే చరిత్ర అన్నారు. 
– కొంతమంది పత్రికాధినేతలతో చేతులు కలిపి కుట్రచేసి స్వర్గీయ ఎన్టీఆర్‌ను అర్ధాంతరంగా సీఎం కుర్చీ నుంచి కిందకు లాగి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అది మొదటి పెళ్లి. 
– 1999లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గెలుస్తారని తెలిసి దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఉన్న వాజ్‌పేయితో పొత్తుపెట్టుకొని గెలిచాడు. అది రెండో పెళ్లి.
– రాజకీయాల్లో పెళ్లిళ్లు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు.. ఏ విధంగా విడాకులు ఇవ్వొచ్చు అని చంద్రబాబు కొత్త పద్ధతులు నేర్పిస్తున్నారన్నారు. 2004లో బీజేపీతో పొత్తుపెట్టుకొని మూడో పెళ్లి చేసుకున్నాడన్నారు. 
– 2009లో ఎన్నికలకు ముందు అప్పటి వరకు బద్ధ శత్రువుగా ఉన్న టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకొని, వైయస్‌ఆర్‌ను ఓడించేందుకు మహా కూటమిని ఏర్పాటు చేసి నాలుగో పెళ్లి చేసుకున్నాడన్నారు. అయినా ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ వైయస్‌ఆర్‌ అధికారంలోకి వచ్చారన్నారు. 
– 2014లో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ ముందు చేతులు కట్టుకొని కూర్చొని మద్దతు కోరారని, బీజేపీ, జనసేనతో కలిసి ఐదోపెళ్లి చేసుకున్నాడన్నారు. 
– మళ్లీ ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేక వస్తుందని గ్రహించి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆరో పెళ్లికి సిద్ధమయ్యాడన్నారు. 
నిత్యం నైతిక విలువల గురించి మాట్లాడే యనమల రామకృష్ణుడు చంద్రబాబు రాజకీయ చరిత్రను, వైయస్‌ జగన్‌ రాజకీయ ప్రయాణాన్ని ప్రజల సమక్షంలో చర్చించేందుకు ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ వాదనలో ఏదైనా తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తామని, ప్రతిపక్షం చెప్పే మాటల్లో ఒక్కటైనా అబద్ధం ఉందేమో ప్రజలనే అడుగుదామన్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్రపై చర్చించేందుకు యనమల చర్చకు సిద్ధపడాలన్నారు. 
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని అధికారికంగా వైయస్‌ జగన్‌ కలిస్తే బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ కలిసిపోతున్నట్లుగా చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారం చేశారని సుధాకర్‌బాబు మండిపడ్డారు. మరి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో నారా బ్రాహ్మిణి ఎందుకు పాల్గొందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హెరిటేజ్‌ డైరెక్టర్‌గా వెళ్లారా..? చంద్రబాబు దూతగా వెళ్లారా..? లోకేష్‌ భార్యగా వెళ్లారా..? ఎలా వెళ్లారో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించింది నిజమా..? కాదా..? నాలుగున్నరేళ్లు బీజేపీతో పొత్తుపెట్టుకొని కేంద్రం, రాష్ట్రంలో భాగస్వాములుగా అధికారాన్ని అనుభవించారన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో బీజేపీతో పొత్తు విరమించుకొని కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. 

రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింహంలా ఒంటరిగానే బరిలోకి దిగుతారని సుధాకర్‌బాబు అన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజానికం ఎవరి మాటలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కొత్త రూపంలో రాబోతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఓటుకు కోట్ల కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని పథకం ప్రకారమే కాంగ్రెస్‌లోకి దించాడన్నారు. కాంగ్రెస్‌ కార్యకలాపాలు అన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ద్వారా తెలుస్తున్నాయన్నారు. ఈ సంబంధం అక్రమమో.. సక్రమమో సోదిరెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 





Back to Top