వీధి రౌడీల్లా టీడీపీ ఎమ్మెల్యేలు


– రోజాపై బోడే ప్రసాద్‌ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం 
– ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్‌ అనర్హుడు
– కాల్‌మనీ– సెక్స్‌రాకెట్‌ పనులు ఆపండి
 విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా పట్ల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బోడే ప్రసాద్‌కు సిగ్గుందా అని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. రోజా మీదా చెప్పులేయిస్తావా? దమ్ముందా నీకు అని నిలదీశారు. పెనమలూరులో ఏ సమయానికి రావాలో చెప్పు వస్తామని సవాలు విసిరారు. ఇసుక దోచుకుంటున్నది నిజమని నీ ఊరులోనే నిరూపిస్తామన్నారు. కమీషన్లు తీసుకుంటున్నదని నిరూపిస్తామన్నారు. ఒక్క చెప్పు రోజా మీద పడిన మరుక్షణం నీ మీదా, నీ నాయకుడి మీద వేల చెప్పులు వేస్తామని హెచ్చరించారు. నిరాధారమైన వ్యాఖ్యలు మాని ఎమ్మెల్యేగా నీవు నిర్వహించాల్సిన విధుల పట్ల దృష్టి సారించాలని హితవు పలికారు. 
– నారా చంద్రబాబుకు, లోకేష్‌కు ఓటమి భయం పట్టుందని, అందుకే పచ్చ నేతలను బజార్‌కు వదిలి బౌ బౌ అంటూ మొరుగుతున్నారన్నారు. అధికారం ఉందన్న అహంభావం, అహంకారంతో మాట్లాడితే ఊరుకోమన్నారు. బోడే ప్రసాద్‌..మీకు ఇంకా ఆరు నెలలు మాత్రమే సమయం ఉందని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సెక్స్‌ రాకెట్‌ వంటి విశృంఖల చర్యలను, పేద మహిళల మాన, ప్రాణాలను దోచుకునే చర్యలు ఆపకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బోడే ప్రసాద్‌ మీడియా ముందు కళ్లనీళ్లు పెట్టుకోవడం యూటూబ్‌లో ఎప్పుడు పెట్టినా వస్తుందన్నారు. ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు ఓ చిన్నపిల్లాడితో రాయించి అడ్డంగా దొరికిన వ్యక్తి బోడే ప్రసాద్‌ అన్నారు. ఇలాంటి వ్యక్తి శాసన సభ్యుడిగా అనర్హుడని, ఆయనకు సిగ్గుంటే రాజీనామా చేయాలని డిమాండు చేశారు. పరీక్షలు రాయడం చేతకాని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఈ నియోజకవర్గ ప్రజల ఖర్మ అన్నారు. బోడి మాటలు మాట్లాడటం ఆపి ఎమ్మెల్యే రోజాకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండు చేశారు. 
 
Back to Top