వైయస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలి


ప్రకాశం: మాట మీద నిలబడటం అంటే ఏమిటో వైయస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి సూచించారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల పదవీ త్యాగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలను మళ్లీ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
 
Back to Top