బీజేపీతో బాబు లాలూచీ ఇంకా కొనసాగుతోంది

ప్రకాశం: బీజేపీతో చంద్రబాబు లాలూచీ ఇంకా కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. అమరావతిలో కూర్చొని మోడీ మోసం చేశాడు.. బీజేపీ అంతు తేల్చుదాం అని ప్రజలను రెచ్చగొట్టే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మోడీ కాళ్ల వద్ద మోకరిల్లాడన్నారు. లాలూచీ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఢిల్లీలో రాష్ట్రం కోసం చంద్రబాబు చేయలేదని, ఓటుకు కోట్ల కేసుకు  భయపడి మోడీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. అందుకు నిదర్శనం నిన్న మోడీ దగ్గర బాబు వేషాలన్నారు. చంద్రబాబు మోడీతో కాళ్లబేరానికి వెళ్లినా ఎల్లో మీడియాకు మాత్రం చంద్రబాబు యుద్ధం చేసినట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. 
 
Back to Top