మా అవిశ్వాసాన్ని స్పీకర్‌ ఎందుకు అంగీకరించలేదు?

విజయవాడ: ప్రత్యేక హోదాపై చర్చించాలని కేంద్రంపై వైయస్‌ఆర్‌సీపీ 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అంగీకరించని కేంద్ర ప్రభుత్వం టీడీపీ అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మా అవిశ్వాస తీర్మానం ఎందుకు అంగీకరించలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.  మేం రాజీనామా చేసి బయటికి వచ్చాక టీడీపీ అవిశ్వాస తీర్మానం ఆమోదించడం వెనుక కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. 
 
Back to Top