ప్రజా సంకల్ప యాత్ర చిరస్మరణీయం


– ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం చేరేసరికి బాబు పతనం ఖాయం
– జననేత పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే కుట్రలు చేశారు
– వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి బిత్తరపోతున్నారు
– ప్రకాశం బ్యారేజీ, గోదావరి వంతెనలు జన సందోహంతో ఊగాయి
– రాక్షస పాలనకు చరమ గీతం పాడేలా ప్రజా సంకల్ప యాత్ర సాగుతోంది
– ప్రజలకు వైయస్‌ జగన్‌ మరింత చేరువయ్యారు
 
హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌పాదయాత్ర ప్రభంజనాన్ని సృష్టిస్తుందని చెప్పారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రను కించపరిచేలా మాట్లాడుతున్న మంత్రులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ జగన్‌ పాదయాత్రను నిర్వీర్యం చేసేందుకు వైయస్‌ఆర్‌సీపీకి చెందిన వారిని టీడీపీలో చేర్చుకునేందుకు కుట్రపన్ని విఫలమయ్యారన్నారు. ఇవాళ టీడీపీకి చెందిన వారు రివర్స్‌గా వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చి చేరడంతో వారిని కాపాడుకునేందుకు చంద్రబాబు కాపలా కాస్తున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర కృష్ణమ్మ వారధిపైకి రాగానే బ్రిడ్జి ఊగిందన్నారు. గోదావరి బ్రిడ్జి పడిపోతుందని ప్రచారం చేశారన్నారు. అసలు పాదయాత్రను గోదావరి బిడ్జీపై అనుమతించకూడదని ప్రయత్నం చేశారన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహించారన్నారు. మొదట్లో జగన్‌ ప్రభావం లేదని చెప్పిన నాయకులు ఇప్పుడు బిత్తరపోతున్నారన్నారు. 

– పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టమని కొందరు సవాలు చేస్తే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత వైయస్‌ఆర్‌సీపీకి దక్కిందని, అది కూడా ప్రజా సంకల్ప యాత్ర నుంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాక్షస పాలన ఎప్పుడు అంతమవుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఈ పాలన అంతం ఖాయమని ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తెలిసిపోయిందన్నారు. ప్రజలు వైయస్‌ జగన్‌ను అర్థం చేసుకోవడానికి ఈ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడిందన్నారు. 

– వైయస్‌ జగన్‌ గత ప్లీనరీలో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసే కార్యక్రమాలను నవరత్నాల పేరుతో ప్రకటించారన్నారు. ఈ నవరత్నాలపై ప్రజల్లో పూర్తి విశ్వాసం కలిగిందన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముందుకు సాగుతున్న తరుణంలో బడుగు, బలహీన వర్గాలు వైయస్‌ జగన్‌తో కలిసి నడుస్తున్నాయన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి అండగా ఉంటారన్న నమ్మకం కలిగిందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్ర మానవ జాతి చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఇంత సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన సందర్భం లేదన్నారు. ఇప్పటికే వైయస్‌ జగన్‌ పది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారన్నారు. మిగతా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం చేరుకునే సరికి ప్రభంజనాన్ని సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు నామమాత్రమే అని, వైయస్‌ జగన్‌ విజయం ఖాయమని, టీడీపీ పతనం మొదలైందన్నారు. అద్భుతమైన ప్రజా సంకల్ప యాత్ర ఓ చరిత్ర అన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పుత్రిడిగా వైయస్‌ జగన్‌ పట్టు వదలకుండా ముందుకు సాగుతున్నారని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ పాదయాత్ర ప్రారంభించిన మొదట్లో 3 వేల కిలోమీటర్లు అనుకున్నామని, అయితే పరిస్థితి మరోలా ఉందని, అంతకంటే ఎక్కువగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. చంద్రబాబు ఇవాళ కాంగ్రెస్, మిగతా పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని, రేపు పొద్దున మళ్ళీ వారిని వదిలి బీజేపీతో కలుస్తారన్నారు. మొన్న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏం మాట్లాడారో ఇంతవరకు చెప్పలేదన్నారు. చంద్రబాబును ఎవరు నమ్మడం లేదని, టీడీపీ పతనం ఖాయమని హెచ్చరించారు. 
 
Back to Top