మోదీ..బాబు కలిసి ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకున్నారు– కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు లేదని కేంద్రం తేల్చి చెప్పింది
– కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయం
– ఎన్డీయేలో భాగస్వాములైన టీడీపీ నాలుగేళ్ల పాటు ఏం చేసింది
– కడప జిల్లా వైయస్‌ఆర్‌సీపీకి కంచుకోట
–  వైయస్‌ఆర్‌ కుటుంబానికి సొంత ప్రాంతంలో పలుకుబడి  
 
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారని, కడపకు ఉక్కు పరిశ్రమ రాకుండా వారే అడ్డుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆరు నెలల్లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతామని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉందని గుర్తు చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు టీడీపీ నేతలు మొరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్డీయేలో భాగస్వాములైన టీడీపీ నాలుగేళ్ల పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం విజయవాడలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  కడప ఉక్కు ఫ్యాక్టరీ, బయ్యారం గనులపై విచారణ చేపడితే కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పుకోలేదని తెలిపారు. కడప జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ మౌనంగా ఉన్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కడప జిల్లా కోసం ఎంతో తపించారన్నారు. ఈ జిల్లా వైయస్‌ఆర్‌సీపీకి పెట్టని కోట అన్నారు. చంద్రబాబుకు చిత్తూరు జిల్లా ఏనాడు కూడా అండగా నిలవలేదన్నారు. సొంత ప్రాంతంలో అత్యధిక పలుకుబడి, ప్రేమానురాగాలు చూరగొన్నది వైయస్‌ఆర్‌ కుటుంబమే అన్నారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ప్రస్తావించారన్నారు. కొన్ని తప్పనిసరిగా చేయాల్సి న అంశాలను పెట్టారన్నారు. వీటిలో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఒక్కటి అన్నారు.  ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటైనా ఆరు నెలలకే షేన్‌ రిపోర్టు ఇ చ్చిందని, అప్పుడు మౌనంగా ఉండి..ఇప్పుడు గావు కేకలు పెడుతున్నారని మండిపడ్డారు. కోర్టులో అఫిడవిట్‌ వేశారని, కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పడంతో ఇన్నాళ్లకు మేల్కోన్నారా అని నిలదీశారు. మొదటి నుంచి వైయస్‌ఆర్‌సీపీ విభజన చట్టంలోని హామీల కోసం చిత్తశుద్దితో పోరాటం చేసిందన్నారు. మేం మాట్లాడటం లేదని టీడీపీ కడప జిల్లాలో ధర్నాలు చేయడం, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆ రోజు మోడీ కాళ్లు పిసికి, ఇవాళ నిరాహార దీక్షలు చేస్తారట అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి కాపురం చేసి, ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని ఇవాళ గగ్గోలు పెడితే ప్రజలు నమ్మరన్నారు. ఎన్‌డీఏలో టీడీపీ కూడా భాగస్వామి అని, ఉక్కు ఫ్యాక్టరీ రాకపోవడానికి చంద్రబాబు బాధ్యుడన్నారు. కడప ఉక్కు ఫ్యాకర్టీని తుక్కు తుక్కుగా చేయాలని టీడీపీ భావించి ఇవాళ మళ్లీ డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. ధర్మా పోరాట దీక్ష అంటూ ఒక డ్రామా చేస్తూ..ఇవాళ కడప జిల్లాలో ధర్నా చేస్తామని మరో డ్రామా చేస్తున్నారని, కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో బయలుదేరారని మండిపడ్డారు. ఇవాళ మోడీతో కుస్తీ పడుతామని బీరాలు పలుకుతున్నారని, రేపు Ðð ళ్లి రెండు కాళ్లు పట్టుకొని మోడీకి నమస్కారం పెట్టే చంద్రబాబుకు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. ఉక్క ఫ్యాక్టరీ, రైల్వే జోన్, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేది వైయస్‌ఆర్‌సీపీనే అని, టీడీపీ మాదిరిగా యూటర్న్‌ తీసుకునే లక్షణం లేదన్నారు. నా మాదిరిగానే సోమిరెడ్డి కూడా ఓడిపోయారని, చంద్రబాబు గడ్డాలు, కాళ్లు పట్టుకొని మంత్రి అయ్యారని, ఇవాళ వైయస్‌ జగన్‌ను విమర్శిస్తున్నారన్నారు. దొడ్డిదారినా లోకే ష్‌ మాదిరిగా మంత్రి అయిన చంద్రమోహన్‌రెడ్డికి వైయస్‌ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. 
 
Back to Top