కేసుకు భయపడే కేసీఆర్‌కు బాబు ప్రేమ లేఖ

కాంగ్రెస్‌తో పీటలమీద కూర్చోబోతూ..
ఓటుకు కోట్ల కేసు బయటకు తీయోద్దనే సందేశం
విభజన విషయంలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగి ఇప్పుడు పొత్తు
చంద్రబాబు లాంటి దుర్మార్గుడు దేశంలోనే ఉండడు
రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి
హోదా కేసులు ఎత్తివేయడం.. ఎన్నికల ఎత్తుగడ
విజయవాడ: కాంగ్రెస్‌తో పీటల మీద కూర్చునేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు ఓటుకు కోట్ల కేసుల ఎక్కడ బయటపెడతారోనని భయపడి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రేమ లేఖ రాశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ఉండాలనే కోరిక ఉన్నప్పటికీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సమయంలో వారు నాతో విభేదించిన కారణంగా ఉండలేకపోతున్నామని ఒక సందేశం పంపించారన్నారు. కలిసి ఉండాలనే కోరిక ఉన్నప్పుడు కేసీఆర్‌ బంగారు పుట్టలో ఎందుకు వేలు పెట్టారని అంబటి ప్రశ్నించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్లు వెచ్చించి ఎమ్మెల్సీని కొనాలని ఎందుకు ప్రయత్నం చేశారు.. రేవంత్‌రెడ్డితో రూ. 50 లక్షల అడ్వాన్స్‌ ఎందుకు ఇప్పించారని ప్రశ్నించారు.

కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో తన ఛాంబర్‌ను కోట్లు పెట్టి మరమ్మతులు చేపించుకున్నాడని, వందల కో ట్లు వెచ్చించి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని రహస్యంగా గృహప్రవేశం చేశాడని అంబటి అన్నారు. హైదరాబాద్‌లోనే సెటిల్‌ అవ్వాలనుకున్న చంద్రబాబు ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన అనంతరం అమరావతికి పారిపోయి వచ్చారన్నారు. మళ్లీ ఓటుకు కోట్ల కేసు విషయం ఎక్కడ బయటపడుతుందోనని ప్రేమ సందేశం పంపించారన్నారు. ఈ కేసు లేనప్పుడు నాగార్జున సాగర్‌ వద్ద నీటి వివాదం జరిగినప్పుడు ఏపీ పోలీసులను ఈల వేసి పంపించిన చంద్రబాబు కేసు బయటపడడంతో వారిని వెనక్కు పిలిపించుకున్నారన్నారు. ఉమ్మడి ఆస్తుల విషయంలో అన్యాయం జరుగుతున్నా, ఉద్యోగ విభజన సక్రమంగా జరగకపోయినా చంద్రబాబు నోరు ఎత్తలేదన్నారు. దీనికి కారణం కలిసి ఉందామనుకోవడమా..? లేక భయపడి మాట్లాడకపోవడమా..? అని ప్రశ్నించారు. 

కేసీఆర్‌తో కలిసి ఉందామనుకుంటే మోడీ తగాదా పెట్టారని చంద్రబాబు మాట్లాడడం హేయమన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌ పద్ధతి లేకుండా చేసిందని నిప్పులు చెరిగిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌ను చంకన ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ హైదరాబాద్‌ నుంచి వస్తే నల్లజెండాలు పట్టుకొని టీడీపీ నేతలు వెంటపడ్డారని, ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని, ఇప్పుడు బీజేపీ అన్యాయం చేసిందని చౌకబారు విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌తో పీటల మీద కూర్చునే ముందు కేసీఆర్‌ ఎక్కడ ఓటుకు కోట్ల కేసు బయటకు తీస్తారనే భయంతో లేఖ రాశారన్నారు. ఇలాంటి దౌర్భాగ్య రాజకీయాలు చేసే వ్యక్తి దేశంలోనే ఎవరూ లేరన్నారు. 

ప్రత్యేక హోదాపై పోరాడిన వారిపై కేసులు ఎత్తివేస్తున్నానని చంద్రబాబు ప్రకటించడం ఎన్నికల ఎత్తుగడ అని అంబటి అన్నారు. ప్రత్యేక హోదాను రానివ్వకుండా అడ్డుకున్న నీచుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. హోదా రాకపోవడానికి మోడీ పాత్ర ఎంత ఉందో.. దానికి డబుల్‌ చంద్రబాబు పాత్ర ఉందన్నారు. మోడీతో పొత్తుపెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో ఏ ఒక్క రోజైనా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారా అని నిలదీశారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు బాగుపడ్డాయా అని ప్రతిపక్షంపై గర్జించిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌తోనే చంద్రబాబు కేసులు ఎత్తివేశారన్నారు. చంద్రబాబు స్వార్థం వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పో యిందన్నారు. కర్నూలు పాపిలి మండలం జలదుర్గం గ్రామంలో తన అన్నకు ఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురైన 14 ఏళ్ల బాలుడు మహేంద్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇంతకు ముందు హోదా రావాలని ఎంతో మంది మరణించారు. వారందరి జీవితాలు తీసుకురాగలవా చంద్రబాబూ అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని అంబటి మరోసారి ప్రజలకు సూచించారు. 
Back to Top