వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం

వైయస్‌ఆర్‌ను తలపించే రామరాజ్యాన్ని స్థాపిస్తారు
కలకాలం గుర్తుండేలా చెరగని ముద్ర వేస్తారు
వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో లిఖించబడుతుంది
ప్రజల అభిమానమే వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌ బలం
తూర్పుగోదావరి: ప్రజల సంక్షేమం కోసం తపించే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే భావన ప్రజల్లో ఉందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఒక్క అవకాశం వస్తే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని మరిపించేలా రామరాజ్యాన్ని స్థాపిస్తారన్నారు. కలకాలం ప్రజలు మెచ్చుకునేలా చెరగని ముద్ర వేసుకుంటారన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకొని మోసకారి చంద్రబాబు పాలన తీరును ఎండగట్టాలని వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి 200ల రోజులు దాటిపోయిందన్నారు. వైయస్‌ఆర్‌ జయంతిన రామచంద్రాపురంలో 2500ల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుందన్నారు. 

ఒక నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేయడం చరిత్రలో లిఖించబడుతుందని అంబటి అన్నారు. వేల కిలోమీటర్ల ఒక నాయకుడు నడవాలంటే దానికి మానసికబలం, చిత్తశుద్ధి కావాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చినప్పుడు పరిష్కరించాలనే ధృడ సంకల్పంతో మహానేత వైయస్‌ఆర్‌ చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించి 16 వందల కిలోమీటర్లు నడిచారన్నారు. అదే దారిలో ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేపట్టారన్నారు. ఇప్పటి వరకు పాదయాత్ర 2500లకు చేరుకుంటుందన్నారు. ప్రజల కోసం తపించే వైయస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పేంటి అనే భావనలో ప్రజలంతా ఉన్నారన్నారు. వైయస్‌ఆర్‌కు, వైయస్‌ జగన్‌కు కండపుష్టి, తిండిపుష్టి ఏమీ లేదని, వారికి ప్రజాబలం ఉందని, ప్రజలు చేతులు ఊపుతూ.. వారి వెంట నడుస్తుంటే ఎంత దూరమైనా నిద్రాహారాలు మాని ప్రయాణం చేయగల శక్తి వారికి ఉందన్నారు. ప్రజలంతా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. 
 
Back to Top